Akhanda: ‘అఖండ’లో సీన్.. వాడేసిన హైదరాబాద్ పోలీసులు!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘అఖండ’ గురించే చర్చ నడుస్తోంది. థియేటర్లలో సత్తా చాటినట్లే.. ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. తమన్ మ్యూజిక్ కి టీవీ బాక్స్ లు బద్దలవుతున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘అఖండ’ సినిమాలో ఓ సీన్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమా పోస్టర్లు, కొన్ని సన్నివేశాల మీద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వేసే మీమ్స్, జనాలకు కల్పించే అవగాహన గురించి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాలా మంది హీరోలను, పోస్టర్లను వాడేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కూడా విడిచిపెట్టలేదు. రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాను కూడా వాడుకున్నారు. ‘పుష్ప’ సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి.. ‘హెల్మెట్‌ తప్పని సరి.. తగ్గేదే లే..’ అంటూ ఓ పోస్టర్ ను రెడీ చేశారు. అలాగే ‘హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.’ అంటూ ఆ పోస్టర్ ను ట్వీట్‌ చేశారు పోలీసులు.

తాజాగా ‘అఖండ’ సినిమాలో ఓ సన్నివేశాన్ని షేర్ చేశారు. ప్రగ్యా జైస్వాల్, బాలయ్య జీపులో వెళ్తుంటారు. ఒక్కసారిగా లారీ అడ్డొస్తుంది.. దీంతో బాలయ్య సడెన్‌గా బ్రేకులు వేస్తాడు. ప్రగ్యా ముందుకు పడిపోతుండగా.. బాలయ్య తన చేతిని అడ్డు పెడతాడు. అలానే ‘సీట్ బెల్ట్ పెట్టుకోండి.. జీవితం చాలా విలువైనది’ అని డైలాగ్ చెబుతారు. ఈ సీన్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ‘ఎంత దూరం వెళ్తున్నారు అనేది కాదు..

అది ఎవరి కారు అనేది కాదు.. ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.. రోడ్డు భద్రత గురించి చెప్పిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి గారికి థ్యాంక్స్’ అని ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus