‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది తనపై పెట్టిన పోలీస్ కంప్లైంట్ పై స్పందించారు. తనవైపు నుండి తప్పు ఉందనిపిస్తే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ నెల 13న ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాష, యాసను కించపరిచేలా కమెడియన్ హైపర్ ఆది మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్స్ పై ఎల్బీ నగర్ ఏసీపీకి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వివాదంపై స్పందించిన హైపర్ ఆది.. తాను కేవలం నటుడిని మాత్రమేనని చెప్పాడు. స్క్రిప్ట్ తను రాయలేదని అన్నాడు. ఆ కార్యక్రమం జరిగే సమయానికి స్టేజ్ మీద ఇరవై మంది వరకు ఆర్టిస్టులు ఉన్నారని.. ఎవరి పాట వారు పాడుకుంటున్నారని చెప్పాడు. స్టేజ్ మీద ఏం జరుగుతుందో అంతమంది మధ్య ఎవరికీ తెలియలేదని అన్నాడు. ఒకవేళ తాను అన్నదాంట్లో నిజంగా తప్పుంటే క్షమించాలని అడగడానికి తనకు ఎలాంటి సమస్య లేదని అన్నాడు.
స్కిట్ ఫ్లోలో ఏదైనా మిస్తకె జరిగి ఉంటే తెలంగాణ వాళ్లకు క్షమాపణలు చెబుతానని వెల్లడించారు. ఇక్కడితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి హైపర్ ఆది తగ్గి మాట్లాడినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!