Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు కలిగే కిక్కే వేరు. అలాంటిది ఇప్పుడు హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కేమరూన్, మన జక్కన్నతో కలిసి ముచ్చటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో జేమ్స్ కేమరూన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం టాలీవుడ్ అభిమానులకు మంచి హై ఇచ్చే విధంగా ఉన్నాయని చెప్పాలి.

Rajamouli 

ఈ స్పెషల్ చిట్ చాట్‌లో జేమ్స్ కేమరూన్ మాట్లాడుతూ.. రాజమౌళి మేకింగ్‌ విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా ఒక ఆశ్చర్యకరమైన కోరికను బయటపెట్టారు. ‘నేను మీ సినిమా సెట్‌కి వస్తాను. నా చేతికి కెమెరా ఇస్తే.. సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా మీ కోసం కొన్ని షాట్స్ తీసిపెడతాను’ అంటూ కేమరూన్ అన్నారు. వరల్డ్ వైడ్ డైరెక్టర్స్ అంతా ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఒక హాలీవుడ్ డైరెక్టర్, మన ఇండియన్ డైరెక్టర్‌ని ఇలా అడగడం అంటే సామాన్య విషయం కాదు. ఇది ఇండియన్ సినిమా స్థాయిని చాటిచెప్పే సందర్భం.

రాజమౌళి(Rajamouli) స్పందిస్తూ.. తాను అవతార్ సినిమాను ఎంతగా ప్రేమిస్తారో వివరించారు. ‘అవతార్ చూస్తున్నంత సేపు నేను ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాను. థియేటర్లో ఆ ప్రపంచంలో పూర్తిగా లీనమైపోయాను’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మొదటి అవతార్ సినిమా ఏకంగా ఏడాది పాటు ఆడిందని గుర్తుచేయడంతో కేమరూన్ కూడా ఫిదా అయ్యారు. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌కు ‘అవతార్’ ఒక బెంచ్‌మార్క్ అని రాజమౌళి కితాబిచ్చారు.

జేమ్స్ కేమరూన్(James Cameron) సృష్టించిన మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఇండియాలో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus