మహా భారతంలో నటించడానికి సిద్ధమన్న ప్రభాస్
- April 25, 2017 / 02:49 PM ISTByFilmy Focus
మహా భారతం అని పేరు వినగానే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డ్రీమ్ ప్రాజక్ట్ గుర్తుకువస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తావించేది.. జక్కన్న సినిమా గురించి కాదు. . ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న మూవీ గురించి. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్నఈ మహా భారతంలో భీముడిగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఖరారు అయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త డా. బి. ఆర్.శెట్టి వెయ్యికోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
బాహుబలి 2 ప్రమోషన్లో భాగంగా కేరళ వెళ్లిన ప్రభాస్ మహాభారతం గురించి స్పందించారు. మహాభారతలో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ కరెక్ట్ గా సూటవుతారని వెల్లడించారు. ఈ సినిమాలో మరే పాత్రకైనా తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్ధమే అంటూ ప్రకటించాడు. ఇప్పటికే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించే ఆలోచనలో ఉన్న మహాభారత చిత్ర బృందం, ప్రభాస్ కి ఏ పాత్రకోసం సంప్రదిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















