‘వారసత్వాన్ని నమ్మను’ అంటున్న యంగ్ టైగర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఒకప్పుడు మంచి హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయిన ఎన్టీఆర్, ఇప్పుడు తాను చేసే ప్రతీ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తూ, చాలా డిఫరెంట్ కధలను ఎంపిక చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా విడుదలయిన ఎన్టీఆర్ జైలవకుశ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది…సినిమాలో కధ బలం పెద్దగా లేకపోయినా, ఎన్టీఆర్ టెరిఫిక్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ రేంజ్ హిట్ ను ఈ సీనియమా ఎంతవరకూ అందుకుంటుదో తెలియాలి అంటే స్పైడర్ సినిమా కూడా రిలీస్ అయితే కానీ చెప్పలేం…ఇదిలా ఉంటే ఈ సినిమా హిట్ అన్న మాట పక్కన పెడితే…ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కాస్త ఇబ్బంది కలిగిస్తుందట…ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే…ఎన్టీఆర్ ఒకానొక ఇంటర్‌వ్యూ లో తాను ‘వారసత్వాన్ని నమ్మను’ అన్న కామెంట్స్‌ చేసాడు. ఈ కామెంట్స్ పైనే ఇన్నర్‌గా నందమూరి ఫాన్స్‌లో అలజడి రేగుతోంది.

ఇటువంటి కామెంట్స్ నాని నిఖిల్ రాజ్ తరుణ్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది కాని జూనియర్ ఎందుకు ఇలా మాట్లాడాడు అన్న కోణంలో జూనియర్ అభిమానులే షాక్ అవుతున్నట్లు టాక్. తారక్ విషయంలో అతడి కెరియర్ మొదటినుండి సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఫాన్స్ మద్దతుగా ఉన్నారు. కొన్నేళ్ల వరకు తన ప్రతి సినిమా వేడుకల్లోనూ బాబాయ్ బాలయ్య పేరును ప్రస్తావించే తారక్ ఇప్పుడు పూర్తిగా మరచాడని ఇప్పటికే బాలకృష్ణ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. దీనికితోడు ఇప్పుడు ‘వారసత్వాన్ని నమ్మను’ అంటూ జూనియర్ బహిరంగంగా చేస్తున్న కామెంట్స్ వల్ల నందమూరి అభిమానులకు దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందని జూనియర్ అభిమానులే భయపడుతున్నట్లు టాక్. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ పై కాస్త విమర్శల వెల్లువ ఎక్కువుగానే ఉంది అని చెప్పక తప్పదు. చూద్దాం మరి ఎన్టీఆర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఎంత దూరం వెళుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus