ఐటం సాంగ్‌ అంటే ఏంటో తెలీదు : జరీన్ ఖాన్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి పరిచయం చేయించిన భామ జరీన్ ఖాన్. సల్మాన్ కి కత్రినా కైఫ్ మీద కోపం జరీన్ కి వెండితెర మార్గం సులభం చేసిందని, కత్రినా అవకాశాలను తగ్గించాలనే.. ఆమె పోలికలు ఉన్నజరీన్ ని తీసికొచ్చినట్లు అప్పట్లో బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుకున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. వీర్ సినిమాలో యసోదర యువరాణిగా జరీన్ ఖాన్ అందంగా కనిపించింది. అయినా అవకాశాలు రాకపోవడంతో సల్మాన్ తన రెడీ సినిమాలో ప్రత్యేక పాటలో నర్తించే అవకాశం ఇప్పించాడు. ఆ పాటలో అందాలు ఆరబోసింది. దీంతో ఈమెకు కోలీవుడ్ ఆహ్వానం పలికింది.

“నాన్ రాజవగ పోగిరెన్” తమిల్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా ఐటెం గర్ల్ గా మారిపోయింది. లేటెస్ట్ గా వీరప్పన్ మూవీలో “ఖల్లాస్” పాటలో ఐటెం గర్ల్ గా అదరగొట్టింది. ఇదే మాట ఆమె ముందే అంటే మాత్రం చాలా కోప్పడుతోంది. “ప్రత్యేక పాటలను ఐటెం పాట అని ఎందుకు అంటారు. అవి సినిమా ప్రమోషన్ కి పనికొస్తాయి, కాబట్టి దానిని ప్రమోషన్ సాంగ్ అనండి. లేకుంటే స్పెషల్ పాటలని పిలవండి. అంతే గాని ఐటెం సాంగ్ అని పిలిచి ఆ పాట విలువని తగ్గించకండి” అని కనిపించిన వారికల్లా చెబుతోందట. చేసిన పనులు చేసి నీతులు చెప్పడం చూసి బాలీవుడ్ వర్గాల వారు నవ్వుతున్నారు. ఆమె పరిశ్రమలోకి రాకముందే ఆ పాటలకు ఐటెం సాంగ్ అని పేరు ఉంది, ఆ సంగతిని జరీన్ ఖాన్ తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus