Prashanth Neel: సలార్ అవుట్ పుట్ చూసుకోలేని పరిస్థితి నాది: డైరెక్టర్ ప్రశాంత్ నీల్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సలార్ సినిమా విషయంలో తప్పు చేశాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరి ఈయన సలార్ సినిమా విషయంలో చేసిన ఆ తప్పు ఏంటి అనే విషయానికి వస్తే కేజిఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించి సినిమాను విడుదల చేసే ముందు ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేయాలా అనే విషయాన్ని తాను చూడలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం సలార్ సినిమా అవుట్ పుట్ కూడా చూడలేని పరిస్థితి నాది అంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అప్పుడు కే జి ఎఫ్ సినిమా విషయంలో జరిగిన విధంగానే ఇప్పుడు సలార్ సినిమా విషయంలో కూడా జరిగిందని అయితే ఈ సినిమా విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని ప్రశాంత్ తెలిపారు. అవుట్ ఫుట్ పై నేను ఆనందం గానే ఉన్నానని తెలిపారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటుందా ప్రభాస్ కి బాహుబలి వంటి సక్సెస్ అందిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పైనే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్న ఎదురు చూడాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus