కొంచెం టైం పట్టినా పర్వాలేదు.. ప్రభాస్ నే ఫాలో అవుతా : రానా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో సంపాదించుకున్న క్రేజ్ అంతా… ఇంతా కాదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆరడుగుల రెండంగుళాల హైట్ తో ఎంతో గ్లామర్ గా కనిపించే ప్రభాస్ సినిమా కోసం చాలా కష్టపడతాడో రాజమౌళి గతంలో చెప్పుకొచ్చాడు. రియల్ లైఫ్ లో ప్రభాస్ ఎంత బద్దకస్తుడో …. పనిలోకి దిగితే మాత్రం పని రాక్షసుడు అయిపోతాడని జక్కన్న చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ‘బాహుబలి’ లో ప్రభాస్ తో కలిసి నటించిన రానా ప్రభాస్ నుండీ ఓ విషయాన్నీ నేర్చుకున్నాడట

.అదేమని రానానే అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు. రానా మాట్లాడుతూ… “ప్రభాస్ లో చాలా సహనం ఉంది. బాహుబలి కోసం ఏకంగా 5 సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఐదేళ్లలో అతను ఎన్ని సినిమాలకైనా డేట్స్ ఇచ్చి ఉండొచ్చు. చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ తనలా చేయలేదు. ఒక మంచి నాణ్యత గల సినిమా కోసం ఎంతో సహనంతో ఉండిపోయాడు.ఈ ఒక్క విషయం మాత్రం ప్రభాస్ నుండీ బాగా అలవాటు చేసుకుంటున్నాను. కొంచెం అలస్యమయినా పర్వాలేదు కానీ డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాను” … అంటూ చెప్పుకొచ్చాడు రానా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus