Manchu Lakshmi: నేను మారాను..ఇక తప్పులు చేయను: మంచు లక్ష్మి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంచు మోహన్ బాబు హీరోగా విలన్ గా కమెడియన్ గా 500 కు పైగా సినిమాలలో నటించి విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇక మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్, మంచు విష్ణు తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలేకపోతున్నారు. కెరీర్ ప్రారంభంలో రెండు, మూడు హిట్స్ అందుకున్న ఈ మంచు సోదరులు ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపించటం లేదు.

ఇక ఇటీవల మంచు విష్ణు “జిన్నా” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మంచు విష్ణు కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక మంచు మనోజ్ చాలాకాలంగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలని ప్రయత్నాలు చేసింది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటిగా సక్సెస్ కాలేకపోవటంతో నిర్మాతగా మారి టీవి షో లు , సినిమాలు నిర్మించింది.

అయితే నిర్మాతగా కూడ సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే లక్ష్మి ప్రసన్న గతంలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొంత కాలం క్రితం ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ”గతంలో నేను సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. ఇప్పుడు నేను మారాను.

ఇకపై ఆ తప్పులు చేయాలి అనుకోడం లేదు” అంటూ కామెంట్ చేసింది. తన జీవితంలో మంచు లక్ష్మి చేసిన అంత పెద్ద తప్పులు ఏమిటని సోషల్ మీడియా జనాలు ఆలోచనలో పడ్డారు. ఆమె చెబుతున్న తప్పులు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవా? లేక వృత్తిపరమైనవా? అనే అనుమానంలో ఉన్నారు. మంచూ లక్ష్మి వృత్తిపరమైన జీవితం గురించి అందరికీ బాగా తెలుసు.

ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రేక్షకులకు తెలియని కోణాలు ఉన్నాయి . దీంతో ఆమె చేసిన పొరపాట్లు వ్యక్తిగతమైనవా లేక వృత్తిపరమైనవా అని ఆలోచనలు పడ్డారు. ఏది ఏమైనా లక్ష్మి మంచు సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ ఇలా వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus