ఆరడుగుల అందగాడు ప్రభాస్ పక్కన నటించాలని హీరోయిన్లు ఆశపడుతుంటారు. డార్లింగ్ తో స్క్రీన్ పంచుకోవాలని కలలు కంటుంటారు. బాహుబలి తరవాత యంగ్ రెబల్ స్టార్ తో పోటీ పడాలని అబ్బాయిలు కూడా కోరుకుంటున్నారు. అటువంటి హీరోతోనే ఢీ కొట్టాలని చెబుతున్నారు. మొన్న ఇదే విషయాన్నీ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ చెప్పగా, తాజాగా సింగం 3 లో విలనిజంతో ఆకట్టుకున్న ఠాకూర్ అనూప్ సింగ్ బయటపెట్టారు. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఆసియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో మెడల్స్ గెలుచుకున్న ఈ కండల వీరుడు తెలుగులో విన్నర్ మూవీలో విలన్ గా నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రోగ్ లో ప్రతికథానాయికగా కనిపించనున్నారు.
ఠాకూర్ రీసెంట్ గా ముంబై మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పారు. “ప్రభాస్ ని ఓ సారి కలిసాను. ఎంతో ఒద్దికగా, నిగర్విగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే మేమిద్దరం స్నేహితులైపోయాము ” అని తెలిపారు. “బాహుబలి లో ప్రభాస్ బాడీ కి నేను ఇంప్రెస్స్ అయ్యాను. అందుకే అతనితో ఒక చిత్రంలోనైనా విలన్ గా తలపడాలని ఉంది” అని ఠాకూర్ స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.