గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూసి షాక్ తిన్న బ్రాహ్మిణి
- January 12, 2017 / 11:52 AM ISTByFilmy Focus
అద్భుతమైన దృశ్యాన్ని చూసినప్పుడు ఆనందంతో నోటమాట రాదు. అదే పరిస్థితి గౌతమి పుత్ర శాతకర్ణి చూసే ప్రేక్షకులకు ఎదురవుతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన దృశ్యకావ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రాన్ని ప్రీమియర్ షో ద్వారా బాలయ్య కూతురు బ్రాహ్మిణి, భర్త నారా లోకేష్ తో కలిసి చూసింది. తండ్రిని శాతకర్ణిగా చూసి కాసేపు షాక్ కి గురిఅయిందంట. వెండితెరపైన శాతవాహనరాజుగా ఆయన నట విశ్వరూపం చూసి నోటమాట రాలేదు. గుర్రపు స్వారీ, కత్తి పట్టే విధానం, పోరాట సన్నివేశాల్లో నాన్న బాలకృష్ణ నటన అద్భుతమని బ్రాహ్మిణి చెప్పారు.
చిత్రం చూస్తున్న సేపు ఒకటవ శతాబ్దంలో ఉన్నట్లు అనుభూతి కలిగిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ” సినిమా బాగుంటుందని అనుకున్నాం కానీ, ఇంత అద్భుతంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు”అంటూ వారిద్దరూ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లోకేష్, బ్రాహ్మిణి మాత్రమే కాదు ఈరోజు థియేటర్ కి వెళ్లిన ప్రతిఒక్కరూ శాతవాహనుల కాలానికి చేరుకుంటున్నారు. దగ్గరుండి ఆనాటి యుద్ధాలను చూస్తున్న అనుభూతి చెందుతున్నారు. పక్కవారితోకూడా మాట్లాడడం మానేసి సినిమాలో లీనమైపోతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















