బాహుబలి మూవీతో ఎస్.ఎస్.రాజమౌళి ఇండియన్ డైరక్టర్ గా పేర తెచ్చుకున్నారు. దేశంలోని అన్ని ప్రాతీయ భాషల నుంచి జక్కన్నకు అవకాశాలు వస్తున్నాయి. అందులో కోలీవుడ్ కూడా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 తమిళ వెర్షన్ తమిళనాడులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆదివారం చెన్నైలో బాహుబలి కంక్లూజన్ ఆడియో వేడుకను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జక్కన్న మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘బాహుబలి వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపే వూహాజనితమైన కథ. అందులో అప్పటి వేషధారణ, సామాజిక స్థితిగతులను ప్రతిబింబించేలా పాత్రలను రూపకల్పన చేశాం. బాహుబలి చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది” అని వివరించారు.
ఇంకా మాట్లాడుతూ ” బాహుబలి చిత్రం అనుకున్నప్పుడే బహు భాషా చిత్రంగా తీయాలని భావించాం. తమిళంలో తీయాలనుకున్నప్పుడు తమిళ మాతృకను కోల్పోకుండా నాజర్, సత్యరాజ్ తదితరులతో ప్రతీ విషయాన్ని చర్చించి ఈ చిత్రాన్ని నిర్మించాం.” అని వెల్లడించారు. మరి రజనీకాంత్ తో సినిమా తీస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు దర్శకధీరుడు బదులిస్తూ “సూపర్ స్టార్ రజనీ కాంత్ తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా.” అని స్పష్టం చేశారు. వీరిద్దరి కలయికలో మూవీ అంటే.. అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.