మన హీరోలు దర్శకులు ఇప్పుడిప్పుడే ద్విభాషా చిత్రాలంటూ పాట మొదలెట్టారు. వీటిలో కథ, కథనాలు సహా నటీనటులు కూడా పెద్దగా మారరు. అయితే ఈ ట్రెండ్ ని తన మూడో సినిమాకే మొదలెట్టాడు దర్శకుడు గౌతమ్ మీనన్. అదీ ఒకే కథని ఇద్దరు హీరో, హీరోయిన్లతో తెరకెక్కించి. ‘కాక్క కాక్క’ (తెలుగులో ఘర్షణ)తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అవసరాన్ని బట్టి కథనాన్ని మార్చి ఇరు భాషా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించగల సమర్థుడు గౌతమ్ మీనన్. ఇందుకు ‘ఏ మాయ చేశావే’ సినిమానే అసలైన ఉదాహరణ.
అలా కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోని చేరిపోయిన ఈ దర్శకుడు నాగ చైతన్యని తమిళ పరిశ్రమకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చైతూ కూడా మొన్నా మధ్య ఈ విషయం గురించి మాట్లాడాడు. చెన్నైలోనే చాలాకాలం పెరిగిన చైతూ తమిళనాట కూడా సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ‘సాహసం..’ సినిమాతోనే అది జరిగాల్సింది కానీ పలు కారణాల వల్ల కుదరలేదన్న చైతూ ఇకపై చేసే సినిమాలు ఆ నోట్ తో ఎవరైనా సంప్రదిస్తే చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇదే విషయం గురించి తాజాగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ‘నాగ చైతన్యను కోలీవుడ్ లో హీరోగా పరిచయం చేస్తా’ అన్నారు. ఇప్పటికే రెండు హిట్స్ కొట్టిన వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే మంచిదే.. కానీ ఇదెప్పుడు నిజమవుతుందో..!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.