‘ఇస్మార్ట్ శంకర్’ పై కమెడియన్ భద్రం షాకింగ్ కామెంట్స్

‘భలే భలే మగాడివోయ్’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ వంటి చిత్రాల్లో తన కామెడీతో ఆకట్టుకున్న భద్రం అందరికీ గుర్తుండే ఉంటాడు. సినిమాల్లో ఎంతగానో కామెడీ చేసే ఈయన రియల్ లైఫ్ లో ఓ డాక్టర్. ఓ పక్క డాక్టర్ గానూ మరోపక్క యాక్టర్ గానూ బిజీగా గడుపుతున్నాడు భద్రం. అయితే ఈయన తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని చూశాడట. ఈ క్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసి… వార్తల్లో నిలిచాడు. ఏకంగా పూరి జగన్నాథ్ పై కేసు వేస్తానంటున్నాడు.

తన సోషల్ మీడియా ద్వారా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చూసిన భద్రం స్పందిస్తూ.. ” పూరి జగన్నాధ్ సర్.. ఛార్మీ మేడమ్.. పై నేను కేసు ఫైల్ చేయబోతున్నాను. నేను రోజూ మెడిటేషన్ చేస్తాను. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చూసిన తర్వాత ధ్యానం చేయలేకపోతున్నాను.. అయితే కొన్ని మెడిటేషన్ క్లాసులు మిస్ అవడం కూడా మంచిదే. ఈ ‘ఇస్మార్ట్’ వీకెండ్ ను ఎంజాయ్ చెయ్యండి” అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తనకి బాగా నచ్చిందని.. అస్సలు మైండ్లో నుండీ వెళ్ళట్లేదని కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఈ కమెడియన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus