Khushbu: ఇక్కడ కొట్టనా, సెట్లో అందరి ముందు కొట్టనా అని అడిగా: ఖుష్బూ!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే, హీరోయిన్లు సినిమా షూటింగ్ సమయంలో హీరోలు లేదా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల కారణంగా వేధింపులకు గురవుతున్నారు అనేది ఎవరూ ఒప్పుకోలేని పచ్చి నిజం. ఈ విషయాన్ని చాలా మంది వ్యతిరేకించవచ్చు కానీ.. ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ల తర్వాతైనా సదరు హీరోయిన్లు ఈ విషయంలో ఓపెన్ అప్ అవుతున్నారు. మొన్నామధ్య సీనియర్ హీరోయిన్ రాధిక (Radhika Sarathkumar) తాను ఫేస్ చేసిన ఇష్యూస్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Khushbu

ఇవాళ గోవా ఫిలిం ఫెస్టివల్లో పాలు పంచుకున్న ఖుష్బూ తాను ఎదుర్కొన్న ఓ విషయం గురించి మాట్లాడుతూ.. “నన్ను ఒక సీనియర్ హీరో సైకిల్ గ్యాప్ ఇస్తావా” అని అడిగాడు.. వెంటనే నేను “సార్ నా చెప్పు సైజ్ 41, ఇక్కడ కొట్టమంటారా లేదా సెట్ లో అందరి ముందు కొట్టమంటారా?” అని అడిగాను. దెబ్బకి ఆ హీరో మళ్లీ నా జోలికి రాలేదు” అని చెప్పుకొచ్చింది.

ఖుష్బూ (Khushbu) తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా నటించి కాబట్టి, ఆ సీనియర్ హీరో ఎవరు అనేది గెస్ చేయడం కాస్త కష్టమే. అయితే.. ఇదే ఖుష్బూ గతంలో చిన్మయి తనను వైరముత్తు మోలెస్ట్ చేశాడని ఆరోపించినప్పుడు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు, స్పందించలేదు కూడా. అటువంటి ఖుష్బూ ఇప్పుడు ఈ తరహా కామెంట్స్ చేయడం హాస్యాస్పదం అనే చెప్పాలి.

ఇకపోతే.. ఖుష్బూ () ఇప్పుడు తెలుగులో ఆఫర్ల మీద దృష్టి సారిస్తోంది. ఆల్రెడీ కొంతమంది ఫిలిం మేకర్స్ ను స్వయంగా ఫోన్ ద్వారా పలకరించిందట. ఖుష్బూకి తెలుగులో మంచి గుర్తింపే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కి (Jr NTR) చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే ఆమెను ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఇస్తాడేమో చూడాలి.

మహేష్ మేనల్లుడు చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus