మా ప్రేమకు వయసుతో సంబంధం లేదు: తమన్నా

తెర మీద స్కిన్‌ షోకు అభ్యంతరం చెప్పని తమన్నా… ముద్దు సన్నివేశాలకు మాత్రం కచ్చితంగా ‘నో’ చెబుతుంది. అది ఆమె రూల్‌ మరి. అయితే ఒక వేళ ఆ రూల్‌ పక్కన పెట్టేస్తే… తమన్నా ఏం చేస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా ఈ ప్రశ్న. దీనికి పెద్ద ఇబ్బందిపడకుండా తమన్నా సమాధానం చెప్పేసింది. దాంతో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు కూడా చెప్పింది. తమన్నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయమంట. అంతేకాదు ఆమె కవితలు కూడా రాస్తోందట. అలాగే డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్స్‌ చేయడానికి కూడా సిద్ధమవుతోందట. ఇంతకీ తమన్నా ఎవరిని ముద్దు పెడతానంది అనేగా మీ ప్రశ్న… అయితే చదివేయండి.

‘ఆహా’లో సమంత నిర్వహిస్తున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్‌’లో గెస్ట్‌గా తమన్నా వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరూ ఎన్నో సరదా విషయాలు ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో తమన్నా ‘నో కిస్‌’ రూల్‌ చర్చకు వచ్చింది. ఒకవేళ ఆ రూల్‌ నీకు నువ్వు తీసేసుకుంటే ఎవరిని ముద్దుపెడతావ్‌ అని సమంత అడిగింది. దానికి తమన్నా ‘విజయ్‌ దేవరకొండ’ అని ఠక్కున చెప్పేసింది. ఈ క్రమంలో అఖిల్‌ టాపిక్‌ కూడా డిస్కషన్‌కి వచ్చింది. అఖిల్‌ను ఇష్టపడుతున్నా అని తమన్నా అంటే… ‘అఖిల్‌ నీ కంటే చిన్నవాడు కదా’ అని సమంత అంది. దానికి తమన్నా… ‘ప్రేమకు వయసుతో సంబంధం లేదు’ అంటూ బదులిచ్చింది.

‘‘నువ్వు కవితలు, పద్యాలు రాస్తావట నిజమేనా?’ అని సమంత అడగ్గా… ‘నా మనసుకు బాధేస్తే రచయిత్రిగా మారిపోతా’ అంటూ తన రచనల వెనుక విషయం చెప్పింది. తమన్నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయమని ముందే చెప్పుకున్నాం కదా… దానికి ఓవర్‌కమ్‌ చేయడానికి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నానని, సొంతంగా స్టంట్స్‌ చేయడం వల్ల అది సాధ్యపడుతుందేమోనని తమన్నా ఆశాభావం వ్యక్తం చేసింది. టీజరే ఇలా ఉందంటే… అసలు ఎపిసోడ్‌ ఇంకెంత సరదాగా ఉంటుందో చూడాలి.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus