పవన్ భజన తమిళ్ డైరెక్టర్లు కూడా మొదలు పెట్టేసారు

గత కొన్నేళ్ళుగా ఏ సినిమా ఫంక్షన్లో అయినా సరే జనాలు కాస్త నీరసంగా ఉంటే.. పవన్ కళ్యాణ్ పేరు చెప్పేవారు కొంతమంది సినీ ప్రముఖులు. సందర్భం ఉన్నా.. లేకపోయినా ఆ పేరు చెప్తే జనాలు కూడా గట్టిగా అరవడం మొదలు పెట్టేవారు. దీనినే చాలా మంది క్యాష్ చేసుకుంటూ వస్తున్నారు. యువ హీరోలు, దర్శకులు, మరికొంత మంది హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళ లిస్ట్ చాలానే ఉంది. ఇప్పుడు ఈ టెక్నిక్ తమిళ సినీ ప్రముఖులకు కూడా తెలిసిపోయినట్టుంది.

‘పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసుకున్నాను.. కుదరక విజయ్ సేతుపతి తో చేశాను అంటున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ చందర్. తమిళ క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘సంగ తమిళన్’ ను.. తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో రిలీజ్ చేస్తూన్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటించారు. నవంబరు 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కాగా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ వేడుకలో.. ఈ చిత్రం దర్శకుడు విజయ్‌ చందర్‌ మాట్లాడుతూ… ‘ఈ కథను పవన్‌ కోసం రాసుకున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారికి ‘డై హార్డ్ ఫ్యాన్’. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో… విజయ్ సేతుపతితో చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రతీసారి ఇలా పవన్ కళ్యాణ్ పేరుని వాడటం కొందరికి చిరాకు పుట్టిస్తుందనుకుంట.. ‘ఎంతసేపు ఈ పవన్ భజన ఏంటి?’… ‘తమిళ సినీ ప్రముఖులకు కూడా పవన్ భజన చేయడం తెలిసిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus