Allu Arjun: ఆ విషయంలో బన్నీనే తోపు.. ఏ హీరో సాటిరారంటూ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అలు అర్జున్ ఒకవైపు వరుస విజయాలతో సక్సెస్ సాధిస్తూ కెరీర్ పరంగా ఇతర హీరోలకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో బన్నీ పారితోషికం తీసుకుంటున్నారు. అయితే బన్నీ తన సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తను చేసే వ్యాపారాల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందుకునేలా బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు బఫెలో వైల్డ్ వింగ్స్ లో ఫ్రాంఛైజీ కలిగి ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న బఫెలో వైల్డ్ వింగ్స్ బన్నీకి భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీలో సైతం బన్నీ పెట్టుబడులు పెట్టారు. ఈ ఓటీటీకి బన్నీ కో ఫౌండర్ కాగా క్వాలిటీ తెలుగు సినిమాలు ఈ ఓటీటీలో ప్రసారమవుతున్నాయి. అల్లు స్టూడియోస్ లో కూడా బన్నీ భారీగా పెట్టుబడులు పెట్టారు.

అల్లు స్టూడియోస్ ద్వారా సినిమాలకు సంబంధించి వేర్వేరు సదుపాయాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఏఏఏ సినిమాస్ లో కూడా బన్నీ భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఈ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ స్క్రీన్ ఏకంగా 67 అడుగుల ఎత్తు ఉంది. సౌత్ ఇండియాలో ఎల్.ఈ.డీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక థియేటర్ ఇదే కావడం గమనార్హం. బన్నీ పెట్టుబడులు ఆయనకు భారీగా లాభాలను అందిస్తున్నాయి.

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ సుకుమార్ కాంబో బెస్ట్ కాంబో కాగా ఈ కాంబినేషన్ లో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. సినిమా సినిమాకు బన్నీకి క్రేజ్ పెరుగుతోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus