Allu Arjun: టాలీవుడ్ నుండీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్!

ఈరోజు 69 వ నేషనల్ అవార్డుల జాబితాని వెల్లడించడం జరిగింది. ఇందులో తెలుగు సినిమాలకి అరుదైన గౌరవం దక్కింది. 2021 వ సంవత్సరంలో సెన్సార్ చేయించుకున్న సినిమాలకి గాను.. ఈ అవార్డుల లిస్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ‘పుష్ప’ ‘ఉప్పెన’ ‘కొండపొలం’ వంటి చిత్రాలకి కూడా నేషనల్ అవార్డులు లభించడం విశేషంగా చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఈసారి ఉత్తమ జాతీయ నటుడు విభాగంలో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు లభించింది.

69 ఏళ్ళ సినీ చరిత్రలో ఓ తెలుగు హీరోకి ఉత్తమ నటుడి కేటగిరిలో జాతీయ అవార్డు లభించడం ఇదే మొదటి సారి కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రానికి గాను అల్లు అర్జున్ కి ఈ అవార్డు లభించింది. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా నార్త్ లో ఆ సినిమా ఊహించని విధంగా రూ.108 కోట్ల వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది.

అల్లు అర్జున్ కి నార్త్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రూవ్ చేసింది పుష్ప చిత్రం. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ పడిన కష్టం కూడా అంతా ఇంతా కాదు. ఓ కూలి గెటప్ లోకి మారిపోయి చిత్తూర్ జిల్లాల్లో తిరిగేసి వచ్చాడు. చిత్తూర్ యాసలో నేచురల్ గా మాట్లాడటం కోసం అల్లు అర్జున్ అలా చేశాడు. అంతేకాదు మొహం నిండా కొబ్బరి నూనె రాసుకుని మరీ ఎండలో బాగా కష్టపడ్డాడు. అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది.

టాలీవుడ్ మొత్తం కాలర్ ఎగరేసుకునేలా చేశాడు అల్లు అర్జున్. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ జనాలు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసించారు. మరోపక్క ఆస్కార్‌ బరిలో విజేతగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌కు సైతం ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు లభించడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతూ కామెంట్లు చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus