‘ఇద్దరి లోకం ఒక్కటే’ ఫస్ట్ డే కలెక్షన్స్

రాజ్ తరుణ్, షాలినీ పాండే నటించిన తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒక్కటే’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ జి.ఆర్. కృష్ణ దర్శకుడు. డిసెంబర్ 25న క్రిస్ట్మస్ రోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. దిల్ రాజు బ్యానర్ నుండీ వచ్చిన ఈ చిత్రం ఇంత ఘోరంగా ఉందేంటి అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనే నమ్మకాన్ని సంపాదించుకున్న రాజ్ తరుణ్ ఈసారి కూడా చతికిలపడ్డాడనే చెప్పాలి.

ఇక ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రానికి 1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా… మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 0.20 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కనీసం డబ్బింగ్ చిత్రం కార్తీ ‘ఖైదీ’ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ ను కూడా ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రానికి రాలేదంటే.. ఎంత ఘోరమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. కనీసం రిలీజ్ రోజు.. అందులోనూ సెలవు రోజున కూడా కనీసం ఓపెనింగ్స్ ను రాబత్తలేకపోతే.. ముందు ముందు ఈ చిత్రం పరిస్థితి ఎలా ఉండబోతుందో.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus