సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ…. దివంగత నేత… మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 22 న ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు రాంగోపాల్ వర్మ. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిస్థితులని ఈ చిత్రంలో చూపించబోతున్నాడు వర్మ. ఇక ఈ చిత్రంలో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కూడా కొన్ని అభ్యన్తరకరమైన సీన్లు ఉన్నాయని ట్రైలర్లు చూస్తే స్పష్టమవుతుంది.
ఇక ఈ క్రమంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? అని రాంగోపాల్ వర్మని మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబిచ్చాడు వర్మ.ఈ ప్రశ్నకు వర్మ సమాధానమిస్తూ… ” ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం రిలీజ్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ సినిమా ఆపాలనుకుంటే నన్ను చంపేయాలి. అలాంటిది ఏదైనా జరిగితే దానికి కూడా ఇంకో మార్గం ఆలోచించి పెట్టుకున్నాను. ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని చీటీరాసి పెట్టాను. దీంతో ఈ చిత్రం బయటకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు’ అంటూ వ్యాఖ్యానించాడు రాంగోపాల్ వర్మ. ఇక ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతమందిస్తున్నాడు.