Vikram Movie: ‘విక్రమ్’ ని తెలుగులో తీస్తే ఈ 10 మంది స్టార్లతో చేయాలట..!

  • June 9, 2022 / 01:00 PM IST

2013 లో వచ్చిన ‘విశ్వరూపం’ తర్వాత కమల్ హాసన్ కు మరో హిట్టు పడలేదు. మధ్యలో కమల్ నుండీ వచ్చిన చీకటి రాజ్యం, ఉత్తమ విలన్, చీకటి రాజ్యం, విశ్వరూపం2, పాపనాశమ్ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. అయితే ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కానగరాజన్ తో ఆయన ‘విక్రమ్’ అనే చిత్రాన్ని చేశారు.ఇది కమల్ హాసన్ మార్క్ మూవీ కాదు. ఆయన స్టైల్ కామెడీ, లిప్ లాక్ లు రొమాంటిక్ సన్నివేశాలు కలిగిన మూవీ కాదిది.పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్. గత వారం జూన్ 3న రిలీజ్ అయిన ఈ సూపర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. అంతలా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ ‘విక్రమ్’ కథ పరంగా చూసుకుంటే పెద్ద గొప్ప కథేమీ కాదు. మొత్తం టేకింగ్ పైనే ఆధారపడి నడుస్తుంది. అవును ‘విక్రమ్’ వరల్డ్ చాలా పెద్దది. సినిమా ఫస్ట్ హాఫ్ లో కమల్ నిడివి చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్వెల్ నుండీ మాత్రమే కమల్ కనిపిస్తారు.

కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో ఇంకా చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. సినిమా పూర్తయ్యాక కూడా ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రతీ పాత్ర విజిల్స్ కొట్టే విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో విక్రమ్ మూవీ పై చాలా స్పూఫ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ఒకవేళ విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అంటూ కొలతలు వేసుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ‘విక్రమ్’ తెలుగులో డబ్ అయిన తర్వాత.. రీమేక్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. విమర్శల పాలవ్వడం తప్ప. అంతలా ‘విక్రమ్’ ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోనే చేసుంటే ఏ పాత్రకి ఏ స్టార్ సూట్ అవుతారు అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటి ప్రకారం 10 మంది టాలీవుడ్ స్టార్లతో విక్రమ్ రూపొందిస్తే బాగుణ్ణు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విక్రమ్ :

కమల్ హాసన్ చేసిన ఈ పాత్రకి తెలుగులో చిరంజీవి, వెంకటేష్ కరెక్ట్ గా సూట్ అవుతారట.

2) అమర్ :

ఫహాద్ ఫాజిల్ చేసిన ఈ పాత్రకి తెలుగులో నాని లేదా విజయ్ దేవరకొండ లేదా అడివి శేష్ కరెక్ట్ గా సూట్ అవుతారట.

3) ఢిల్లీ :

‘ఖైదీ’ లో కార్తీ పాత్రని కూడా ‘విక్రమ్’ లో వాడిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకి ఎన్టీఆర్ లేదా చరణ్ లేదా అల్లు అర్జున్ సూట్ అవుతారట.

4) రోలెక్స్ :

సూర్య చేసిన ఈ పాత్రకి మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ కరెక్ట్ గా సూట్ అవుతాడట.

5) సంతానం :

విజయ్ సేతుపతి చేసిన ఈ పాత్రకి రవితేజ లేదా గోపీచంద్ లేదా రానా.. కరెక్ట్ గా సూట్ అవుతారట.

6) ఏజెంట్ టీనా :

వాసంతి చేసిన ఈ పాత్రకి తెలుగులో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కరెక్ట్ గా సూట్ అవుతుందట.

7) ఇన్స్పెక్టర్ బిజోయ్ :

రేన్ పోషించిన ఈ పాత్రకి తెలుగులో మురళీ శర్మ, సముద్రఖని, జగపతి బాబు, శ్రీకాంత్… వంటి వారు సూట్ అవుతారట.

8) ప్రభంజన్ :

విక్రమ్ కొడుకు మరియు ఎసిపి అయిన ప్రభంజన్ పాత్రకి టాలెంటెడ్ హీరో సత్యదేవ్ సూట్ అవుతాడట.

9) జోస్ :

చెంబన్ వినోద్ జోష్ పోషించిన ఈ పాత్రకి మన రావు రమేష్ లేదా సంపత్ రాజ్ కరెక్ట్ గా సూట్ అవుతారట.

10) గాయత్రీ అమర్ :

ఫహాద్ ఫాజిల్ చేసిన అమర్ పాత్రకి భార్య పాత్ర గాయత్రీ. ఈ పాత్రని పోషించింది గాయత్రీ శంకర్.. తెలుగులో ఈ పాత్రకి నివేదా థామస్ లేదా నివేదా పేతురాజ్ అయితే బాగా సూట్ అవుతారట.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus