మీటూ మూమెంట్ గురించి స్పందించిన ఇలియానా

మీటూ అనే మూమెంట్ మొదలవ్వడం ఈమధ్యే అయినప్పటికీ.. ఈ తరహా సమస్యలు గత కొన్నేళ్లుగా మన హీరోయిన్లు ఎదుర్కొంటూనే ఉన్నారని నిన్న ఇలియానా చెప్పేవారకు చాలా మందికి తెలియలేదు. పరిచయ చిత్రం “దేవదాస్”తోనే సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకొన్న ఇలియానా ఆ తర్వాత “పోకిరి, జల్సా” లాంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగింది. అలాంటి స్టార్ డమ్ & పొజిషన్ సొంతం చేసుకొన్న ఇలియానా కూడా అప్పట్లో లైంగిక వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయాన్ని స్వయంగా ఇలియానా నిన్న మీడియా మిత్రులతో ముచ్చటిస్తూ వెల్లడించింది. అయితే.. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏమీ చెప్పాలనుకోవడం లేదని, అదంతా గతం, ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది.

“దేవుడు చేసిన మనుషులు” అనంతరం టాలీవుడ్ కి బై చెప్పిన ఇలియానా.. దాదాపు 6 ఏళ్ల విరామం అనంతరం మళ్ళీ “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. తన ఫేవరెట్ యాక్టర్ రవితేజ సరసన నటిస్తూ రీఎంట్రీ ఇవ్వడం పట్ల ఇలియానా సంతోషం వ్యక్తం చేసింది. పైగా.. ఈ సినిమా కోసం ఇలియానా సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై అందరికంటే ఎక్కువ ఆశలు పెట్టుకొంది ఇలియానా. ఈ సినిమా సక్సెస్ బట్టి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus