శ్రీనువైట్ల చూపు ఇలియానా వైపు, ఈసారైనా హిట్ కొడతాడా?
- April 16, 2019 / 08:18 PM ISTByFilmy Focus
“ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ” లాంటి డిజాస్టర్స్ అనంతరం కూడా శ్రీనువైట్లకి సినిమా తీసే అవకాశం రావడం.. ఒక హీరో అతను చెప్పిన కథను ఒప్పుకోవడం అనేది ప్రపంచ వింతగా పేర్కొనాల్సిన విషయం. అలాంటి వింత జరిగినప్పుడు కూడా శ్రీనువైట్ల ఇంకా కొన్ని విషయాల్లో మొండిపట్టు పడుతున్నాడు. శ్రీనువైట్ల తాజా రిక్వెస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రీనువైట్ల కెరీర్ లో ఒన్నాఫ్ ది బ్లాక్ బస్టర్ అయిన “ఢీ” చిత్రానికి సీక్వెల్ గా ఓ సినిమాకి తెరకెక్కించనున్నాడు. ఢీ హీరో మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మించాలని కూడా ఫిక్స్ అయ్యింది.
- చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఫ్రేమకథా చిత్రం 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యం
అయితే.. ఈ సినిమాలో కథానాయకిగా రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నారు ముందు. రకుల్ కూడా ఒకే చెప్పింది. కానీ.. శ్రీనువైట్ల మాత్రం తనకు ఇలియానా కావాలని గొడవ చేస్తున్నాడట. ఆల్రెడీ మంచు విష్ణు-ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన “సలీం”, శ్రీనువైట్ల-ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్ అయినా కూడా శ్రీనువైట్ల మళ్ళీ ఇలియానానే హీరోయిన్ గా తీసుకోవాలి అనుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
















