సక్సెస్ కోసం ఇలియానా పడుతున్న పాట్లన్నీ ఫ్లాపవుతున్నాయి

అప్పట్లో మహ్మద్ తుగ్లక్ అనే రాజు ఉన్న రాజ్యంలో సుఖంగా ఉండకుండా.. పరాయి దేశాల మీద యుద్ధాలు చేద్దామనే పిచ్చి ఆలోచనతో ఏవేవో పిచ్చిపనులు చేసేవాడట. ఆ కారణంగా ఉన్న రాజ్యం కోల్పోయి.. వేరే రాజ్యం దక్కించుకోలేక ఎటూ కాకుండా మిగిలిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్ లో స్తిరపడడం కోసం ప్రయత్నిస్తున్న హీరోయిన్ల పరిస్థితి కూడా అలానే తయారైంది. తెలుగు, తమిళ భాషల్లో కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మరియు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. బాలీవుడ్ మీద వెర్రి అభిమానంతో అక్కడ సగం రెమ్యూనరేషన్ కే సెకండ్ హీరోయిన్ పాత్రలు కూడా పోషించేసి హిట్ కొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతూనే ఉన్నాయి.

రీసెంట్ గా పూజా హెగ్డే “హౌస్ ఫుల్ 4″తో హిట్ కొట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన విధానం చూసి ఉన్నాం.. ఇప్పుడు అదే బాటలో మరో తెలుగు స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా డిజాస్టర్ ను అందుకొంది. ఆమె నటించిన తాజా చిత్రం “పాగల్ పంటి” నిన్న విడుదలై కనీస స్థాయి రివ్యూలు కానీ ఓపెనింగ్స్ కానీ సంపాదించలేకపోయింది. దాంతో బాలీవుడ్ లో హిట్ కొట్టాలన్న ఇలియానా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది. మరి ఇప్పటికైనా ఇలియానా టాలీవుడ్ కి తిరిగొస్తుందో లేదో.. ఎందుకంటే ఇంకొన్నాళ్లు ఆగి వచ్చినా ఎవరూ పట్టించుకోరు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus