ఇలియానా రీ ఎంట్రీతో తెలుగులో బిజీ అయ్యేలా ఉంది

గోవా బ్యూటీ ఇలియానాకి కంటే ఆమె నడుముకే ఎక్కువమంది అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. దేవదాస్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ సుందరి.. పోకిరి సినిమాతో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలు చేసింది. ఆమె అందానికి ఆకర్షితులైన బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆహ్వానించారు. ఇంకేముంది అక్కడికి మకాం మార్చింది. అందుకు తగ్గట్టు జీరో సైజ్ లోకి మారిపోయింది. కథ అడ్డం తిరిగింది. సినిమాలు లేక ఖాళీగా కూర్చుంది. అవకాశాలు లేక ఇబ్బంది పడుతోన్న ఆమెకు శ్రీను వైట్ల ఛాన్స్ ఇచ్చారు. అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారు.

రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఇందులో రవితేజ లుక్ ని రిలీజ్ చేశారు కానీ.. ఇలియానా లుక్ రిలీజ్ చేయలేదు. రీసెంట్ గా ఆమె ఫోటోలు బయటికి వచ్చాయి. ఇందులో ఆమె కొంచెం బరువు పెరిగినట్టు తెలుస్తోంది. బొద్దుగా ఉన్నప్పటికీ ముద్దుగా ఉందని నెటిజనులు చెబుతున్నారు. రీ ఎంట్రీతో మరింతమందిని ఆకట్టుకోవడం ఖాయమని తేల్చేశారు. అలా ఆకర్షిస్తే అవకాశాలు కూడా వెల్లువెత్తుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus