దక్షిణాది చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసిన ఇలియాన

చక్కని నడుముతో తెలుగు యువతను గిలిగింతలు పెట్టిన ఇలియాన దక్షిణాది చిత్ర పరిశ్రమను వదిలి బాలీవుడ్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం ‘రెయిడ్‌’ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించింది. రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఇలియాన దక్షిణాది చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసింది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని రిచా చద్దా, కంగనా రనౌత్‌, స్వరా భాస్కర్‌ తదితరులు మీడియా ముందు ప్రస్తావించారు. ఇదే విషయం గురించి ఇలియాన తాజాగా మాట్లాడింది. నటీమణులు ఎందుకు దీని గురించి మాట్లాడరో వివరించింది. “వేధింపులకు గురైన వారు దాన్ని బయటపెడితే.. ధైర్యవంతులు అనొచ్చు. కానీ ఆ తర్వాత వారి కెరీర్‌ అక్కడితో ముగిసిపోతుంది.

చాలా ఏళ్ల క్రితం దక్షిణ చిత్ర పరిశ్రమలో ఓ జూనియర్‌ ఆర్టిస్టుకు పెద్ద నిర్మాత నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలని ఆమె నన్ను సలహా అడిగింది. నీకు.. నేను సలహా ఇవ్వలేని సమస్య ఇదని చెప్పా. దీని గురించి ఆమే స్వయంగా నిర్ణయం తీసుకోవాలి, ఆమెపై మరో వ్యక్తి ఒత్తిడి తగదు” అని ఆనాటి సంగతిని వెల్లడించింది. ఇంకా మాట్లాడుతూ “ఈ దేశంలో నటీనటుల్ని పూజిస్తారు. అలాంటి వారికి ఇలా చెత్త సమస్యలు ఉంటాయని తెలియజేయడానికి చాలా మంది నటీనటులు ఏకమవ్వాలి” అని తన అభిప్రాయాన్ని తెలిపింది. మరి ఈ సమస్యపై పోరాడటానికి ఎంతమంది హీరోయిన్స్ చేతులు కలుపుతారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus