ఇక సినిమాలకు ఇలియానా గుడ్ బై?

టాలీవుడ్ లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకుని ఓ రేంజ్ లో వుండేది ఇలియానా. మహేష్ బాబు తో ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ తో ‘జల్సా’, ఎన్టీఆర్ తో ‘రాఖీ’ ‘శక్తి’, అల్లు అర్జున్ తో ‘జులాయి’,రవితేజ తో ‘కిక్’, రానా తో ‘నేను నా రాక్షసి’ వంటి చిత్రాలు చేసి అప్పటికి మంచి ఫామ్లో ఉన్న ఈ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్ళి బిజీ అయితే అయ్యింది కానీ స్టార్ హీరోయిన్ అయితే అవ్వలేకపోయింది.అందులోనూ ప్రేమలో కూడా పడి కెరీర్ ను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది.

అటు తరువాత తన లవర్ తో కూడా విడిపోయింది. ఆ టైములో డిప్రెషన్ కు వెళ్లి పోయి.. ఫిజిక్ పై ఫోకస్ చేయకుండా లావుగా అయిపొయింది. ఆ టైములో ఆఫర్లు ఏమీ లేకపోవడంతో తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం చేసింది కానీ వర్కౌట్ కాలేదు.ఇక తరువాత కొంత మేర సన్నగా తయారయ్యింది. దీంతో తమిళ్ లో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఇంకా అది ఫైనల్ కాలేదు అని సమాచారం.

ఏమాత్రం ఫామ్లో లేని ఇలియానా ను తీసుకోవడం వల్ల ఏమాత్రం సినిమాకి వెయిట్ ఉండదని… అందులోనూ ఆమె ఎక్కువ పారితోషికం అడుగుతుంది అని నిర్మాతలు ఆలోచనలో పడినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ ఆఫర్ ఇక ఆమె చేతిలో నుండీ జారినట్టే అని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ భామ చేతిలో ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి… ప్రస్తుతానికి ఆ ఆలోచన పెట్టుకోకుండా ఓ స్పోర్ట్స్ యాంకర్ గా మారబోతుందట. ఓ ప్రముఖ ఛానల్ వారు కూడా ఈమెను సంప్రదించి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చెయ్యడంతో ఇలియానా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus