బాహుబలి కంక్లూజన్ లో దాగున్న రహస్యాలు

  • April 25, 2017 / 12:06 PM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలు ఎదురు చూస్తున్న బాహుబలి కంక్లూజన్ కొన్ని రోజుల్లో థియేటర్లోకి రానుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్, పాటలు రీసెంట్ గా రిలీజ్ అయి సినిమాపై అంచనాలను పెంచాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఒక్కటే కాకుండా మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఉన్నారు. అవి ఏమిటంటే ?

01 . శివగామి చీర బాహుబలి బిగినింగ్ లో శిశువును చేతిలో పట్టుకొని శివగామి కొండకిందకు వస్తుంది. అప్పుడు ఆమె ఎర్ర బార్డర్ లో ఆకుపచ్చ చీర కట్టుకొని ఉంటుంది. బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ లో అదే చీరలో చేతిలో శిశువును పట్టుకొని మహేంద్ర బాహుబలి అని అరిచి చెబుతుంది. మహిష్మతి రాజ్యానికి రాజు ఇతనే అని రాజమాతగా వెల్లడించింది. మరి రాజ్యాన్ని విడిచి ఆమె ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?

02 . అవి దేవసేన చేతులేనా ? బాహుబలి ట్రైలర్ లో శివగామి కాళ్లను రక్తము నిండిన చేతులు తాకుతుంటాయి. అవి దేవసేన వేనా? లేక వేరేవారిదా?, దేవసేనదే అయితే.. శివగామి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది?

03 . ప్రభాస్ త్రి పాత్రాభినయం తండ్రి కొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా మాత్రమే కదా ప్రభాస్ నటించింది. ఈ మూడో పాత్ర ఎవరనే కదా .. మీ డవుట్! అతనే అమరేంద్ర బాహుబలి తండ్రి ధర్మేంద్ర బాహుబలి. అభిమానులను ఆశ్చర్య పర్చడానికి ఈ క్యారక్టర్ ని ఇప్పటివరకు రివీల్ చేయకుండా రాజమౌళి జాగ్రత్త వహించారు. ధర్మేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటించాడా? ఫోటోకి మాత్రమే పరిమితమా?

04 . తండ్రిని చంపిన తర్వాత కొడుకుని కట్టప్ప కలిశాడా ? శిశువు పాదాలను కట్టప్ప తన తలపై పెట్టుకుంటాడు.. ఆ సీన్ గురించి పూర్తిగా మనకి తెలియ పోయినప్పటికీ.. ఆ షాట్ లో కట్టప్ప తలకి గాయాలు అయి ఉంటాయి. అంటే అమరేంద్ర బాహుబలిని చంపిన తర్వాత క్షమాపణగా కొడుకు మహేంద్ర బాహుబలి కాలుని కట్టప్ప తలపై పెట్టుకున్నాడా? అనే అనుమానం కలుగుతుంది.

05 . మహిష్మతి సైన్యం గురించి ఎవరికీ తెలుసు? మహిష్మతి రాజ్యంలోని సంగతులను తెలుసుకొని ఒకడు కాలకేయుడికి అందిస్తాడు. అప్పుడు కాలకేయుడు రాజ్యంపై వచ్చి బాహుబలి, భల్లాల దేవా దెబ్బకి మరణిస్తాడు. ఈ సైన్యం రహస్యాలు కాలకేయుడితో పాటు మరొకరికి తెలుసు. ఆ పాత్రనే సుబ్బు రాజు పోషించారు. ఇంతకీ సుబ్బరాజుకి మహిష్మతి రాజ్య సైన్యం గురించి తెలుసా? తెలియదా?

06 . బాహుబలి చనిపోక ముందే భల్లాల దేవా రాజయ్యాడా? బాహుబలి బిగింగ్ సమయంలో మీరు మేకింగ్ వీడియోని పరిశీలిస్తే మీకు రాజా దర్బార్ లో బాహుబలి కత్తి తీస్తున్న షాట్ కనిపిస్తుంది. అందులో అవుట్ ఆఫ్ ఫోకస్ లో సింహాసనం పైన భల్లాల దేవా కూర్చొని ఉంటాడు. అంటే బాహుబలి చనిపోక ముందే భల్లాల దేవా రాజయ్యాడా?

ఏంటీ సీక్రెట్స్ అని చెప్పి.. ప్రశ్నలు వేస్తున్నారు .. అని కోపగించుకున్నారా? అయితే మమ్మల్ని క్షమించండి. ఇవన్నీ మాకు బాహుబలి 2 ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిన ప్రశ్నలు. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus