IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

సినిమాలకు రేటింగ్స్‌ ఇస్తూ తరచూ జాబితాలు రిలీజ్‌ చేసే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ మరో లిస్ట్‌ను బయటకు తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా గత 26 ఏళ్ల సినిమాల లిస్ట్‌ను బయట పెట్టింది. అంటే జనవరి 1, 2000 నుండి ఆగస్టు 31, 2025 వరకు విడుదలైన సినిమాల నుండది టాప్‌ 130 సినిమాల లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తమ 250 మిలియన్లకుపైగా యూజర్లు ఇచ్చిన రేటింగ్‌ ఆధారంగా ఈ జాబితా వివరాలు వెల్లడించామని ఐఎండీబీ తెలిపింది.

IMDB 26 years top movies list

26 ఏళ్ల లిస్ట్‌లో ఒక్కో ఏడాదికి ఐదు సినిమాలు చెప్పున ఈ 130 సినిమాలను ప్రకటించింది. (Top 130 Indian Movies)ను రూపొందించింది. అంటే.. ఏడాదికి 5 సినిమాల చొప్పున 26 ఏళ్లకుగానూ 130 చిత్రాలు టాప్‌లో ఉన్నాయి. అన్ని రాస్తే లిస్ట్‌ చాంతాడంత అవుతుంది కాబట్టి.. ప్రతి సంవత్సరంలో తొలి స్థానంలో నిలిచిన సినిమా లిస్ట్‌ చూస్తే.. ‘మొహబ్బతే’ (2000), ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ (2001), ‘దేవ్‌దాస్‌’ (2002), ‘కల్‌ హో నా హో’ (2003), ‘వీర్‌ జారా’ (2004), ‘బ్లాక్‌’ (2005), ‘ధూమ్‌ 2’ (2006) ఉన్నాయి.

ఇంకా ‘తారే జమీర్‌ పర్‌’ (2007), ‘రబ్‌ నే బనా దీ జోడీ’ (2008), ‘3 ఇడియట్స్‌’ (2009), ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ (2010), ‘జిందగీ నా మిలేగీ దొబారా’ (2011), ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపూర్‌’ (2012), ‘ది లంచ్‌ బాక్స్‌’ (2013), ‘పీకే’ (2014), ‘బాహుబలి 1’ (2015), ‘దంగల్‌’ (2016), ‘బాహుబలి 2’ (2017), ‘కేజీయఫ్‌ 1’ (2018), ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ (2019), ‘దిల్‌ బెచారా’ (2020), ‘పుష్ప: ది రైజ్‌’ (2021), ‘కేజీయఫ్‌ 2’ (2022), ‘యానిమల్‌’ (2023), ‘పుష్ప: ది రూల్‌’ (2024) ఉన్నాయి ఇక ఈ ఏడాది ఇప్పటివకు ‘సైయారా’కు ఫస్ట్‌ ప్లేస్‌ ఇచ్చారు.

ఈ లిస్ట్‌లో ఫస్ట్‌లో లేకకపోయినా కొన్ని మన సినిమాలు ఇతర స్థానాల్లో నిలిచాయి. ‘మగధీర’ (2009), ‘1: నేనొక్కడినే’ (2014), ‘అర్జున్‌ రెడ్డి’ (2017), ‘అల వైకుంఠపురములో’(2020), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022), ‘సలార్‌ 1’ (2023) ఉన్నాయి.

మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags