టాలీవుడ్ లో ఇప్పటికీ పవన్ కల్యాణే నెం.1 హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఎక్కువ సంపాదించే వారి లిస్టులో ఇప్పటికీ టాప్ పొజిషన్లో కొనసాగుతుండడం విశేషం. ఇండియాలో ఎక్కువ సంపాదించే వారి లిస్ట్ ను రీసెంట్ గా ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ‘ఫోర్బ్స్ 2018 ఇండియా సెలబ్రిటీ 100’ లిస్ట్ లో బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉండగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

మరోపక్క సౌత్ లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రజినీ 14 స్థానంలో ఉండగా… టాలీవుడ్ నుండీ పవన్ కళ్యాణ్ 24వ స్థానంలో నిలిచాడు. సినిమాలు లేనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.ఇక జూనియర్ కు ఎన్టీఆర్ 28వ స్థానం దక్కగా మహేష్‌బాబు కు 33వ స్థానంలో నిలిచాడు.

2017 అక్టోబర్ 1 నుండీ 2018 సెప్టెంబర్ 30 వరకు సెలబ్రిటీల సంపాదనను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ లిస్ట్ ను విదుదల చేసింది. ఇక ఈ లిస్టులో నిలిచిన మన టాలీవుడ్ హీరోలు మరియు వారి సంపాదన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి :

1. పవన్ కళ్యాణ్ (24వ స్థానం) – రూ.31.33 కోట్లు

2. జూనియర్ ఎన్టీఆర్ (28వ స్థానం) – రూ.28 కోట్లు

3. మహేష్‌బాబు (33వ స్థానం) – రూ.24.33 కోట్లు

4. నాగార్జున (36వ స్థానం) – రూ.22.25 కోట్లు

5. కొరటాల శివ (39వ స్థానం) – రూ.20 కోట్లు

6. అల్లు అర్జున్ (64వ స్థానం) – రూ.15.67 కోట్లు

7. రామ్ చరణ్ (72వ స్థానం) – రూ.14 కోట్లు

8. విజయ్ దేవరకొండ (72వ స్థానం) – రూ.14 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus