Prabhas: ‘సలార్’ తో మరోసారి.. టాలీవుడ్లో ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇది..!

‘బాహుబలి'(సిరీస్) ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు పెద్దగా ఆడింది లేదు. ‘సాహో’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు హిందీలో బాగా ఆడాయి.’రాధే శ్యామ్’ అన్ని చోట్లా ప్లాప్ మూవీగా నిలిచింది. అలా అని ప్రభాస్ ఇమేజ్ తగ్గిందంటూ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే డబుల్ అయ్యిందనే చెప్పాలి. ప్రభాస్ సినిమాకు ఓ మాదిరి టాక్ వచ్చినా కలెక్షన్స్ ఓ రేంజ్లో వస్తాయి. వెయ్యి కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభాస్ సినిమాలు ఎప్పుడూ తెలియజేస్తూనే ఉన్నాయి.

తాజాగా రిలీజ్ అయిన ‘సలార్’ టీజర్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీ టీజర్ నిన్న అంటే జూలై 6న తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాలకి రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు అంతా అలారం పెట్టుకుని మరీ నిద్రలేచి టీజర్ ను చూశారు. అందువల్లే ఈ టీజర్ 24 గంటల వ్యవధిలో 83 మిలియన్ల వ్యూస్ ను అలాగే 1 .67 మిలియన్ లైక్స్ ను నమోదు చేసింది. ఇది మాత్రమే కాదు.. టాప్ 4 ఇండియన్ మూవీ టీజర్స్ ను గమనిస్తే.

1 ) సలార్ : 83 మిలియన్ల వ్యూస్

2 ) ఆదిపురుష్ : 68 .96 మిలియన్ల వ్యూస్

3 ) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 : 68 .83 మిలియన్ల వ్యూస్

4 ) రాధే శ్యామ్ : 42 .66 మిలియన్ల వ్యూస్

ఇలా టాప్ 4లో 3 ప్రభాస్ వే (Prabhas) ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. సో ఈ రికార్డ్స్ ను బట్టి ‘సలార్’ ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ‘సలార్’ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేయడం కూడా ఖాయమనే చెప్పాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus