Inaya Sultana: కన్ఫెషన్ రూమ్ లో మనసులో మాట చెప్పిన ఇనయ..! ఏం మాట్లాడిందంటే..?

బిగ్ బాస్ హౌస్ లో బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా బిగ్ బాస్ ఒక కేక్ ని పంపించాడు. ఇది ఇంట్లో ఉన్న నలుగురు సభ్యులు మాత్రమే తినాలని కండీషన్ పెట్టాడు. దీంతో ఓటింగ్ చేద్దామని అనుకున్నారు కొంతమంది. కానీ, దీనికి కూడా ఓటింగ్ ఏంటని కొంతమంది తప్పుకున్నారు. ఇక్కడే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. నేను తింటాను అంటే నేను తింటాను అంటూ 10మంది ముందుకు వచ్చారు. దీనివల్ల బిగ్ బాస్ ఇచ్చిన 15 నిమిషాల టైమ్ అయిపోయింది. కేక్ ఎవ్వరికీ దక్కలేదు. తిరిగి కేక్ ని స్టోర్ రూమ్ లో పెట్టేయమని చెప్పాడు బిగ్ బాస్. ఈ కేక్ కోసం ఇంట్లో వాళ్లు తర్వాత చర్చలు మొదలుపెట్టారు.

ఓటింగ్ పెట్టుకుంటే బాగుండేదని చెప్పారు. ఓటింగ్ వల్ల ఎవ్వరూ నా పేరు చెప్పరు అంటూ ఇనయ బాధపడింది. అంతేకాదు, ఇలాంటివి ఇంకా వస్తే కెప్టెన్ కీర్తి డెసీషన్ తీస్కుంటుందని బాలాదిత్య చెప్పాడు. దీనికి కొంతమంది అంగీకరరించారు కానీ, మరికొంతమంది వ్యతిరేకించారు. ఇక్కడే ఇనయని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్బాస్. కన్ఫెషన్ రూమ్ లో ఇనయని హౌస్ లో ఏదైనా ఆసక్తికరమైన విషయాలు చెప్తే మీకు కేక్ తినే అర్హత లభిస్తుందని చెప్పాడు. ఎదురుగా కేక్ ని చూసి బాగా టెమ్ట్ అయిన ఇనయ తనకి సూర్య అంటే చాలా ఇష్టమని, క్రష్ అని మనసులో మాటని చెప్పేసింది.

ఆరోహితో మాట్లాడేటపుడు బాగా జెలస్ ఫీల్ అయ్యాను అని, ఇప్పుడు ఆరోహి వెళ్లిపోయిన తర్వాత తను నాతో ఫ్రీగా ఉంటున్నాడని చెప్పింది. తన మనసులో మాటని ఓపెన్ గా బిగ్బాస్ హౌస్ లో పంచుకుంది. ఇక అర్జున్ శ్రీసత్యని కాకుండా మెల్లగా వాసంతీ వైపు వస్తున్నాడని, శ్రీసత్యకి ఇంట్రస్ట్ లేకపోతే వాసంతీకి ఉందని చెప్పింది. అలాగే, మేబీ వాళ్లు మంచి పైయిర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ హౌస్ లో జరిగే విషయాలు కొన్ని చెప్పింది.

ఇనయ చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉండటంతో బిగ్ బాస్ కేక్ ని ఇనయకి పెట్టాడు. అంతేకాదు, ఆ కేక్ ని మీకు నచ్చిన వాళ్లతో షేర్ చేసుకోవచ్చని కూడా చెప్పాడు. దీంతో కేక్ ని బయటకి తీస్కుని వెళ్లిన ఇనయ అందరికీ షేర్ చేసింది. ఇంట్లో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటున్న ఇనయ మిగతా హౌస్ మేట్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. నిక్కచ్ఛిగా , సూటిగా మాట్లాడుతూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈవారం నామినేషన్స్ లో టాప్ ఓటింగ్ లో దూసుకుపోతోంది ఇనయ. ఇలాగే ఓటింగ్ సాగితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంటున్నారు బిగ్బాస్ లవర్స్. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus