బాలీవుడ్ సింగర్ రేణు నగర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ యువ గాయని ఆరోగ్యం ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఆమె ఆరోగ్యం అలా కావడానికి గల కారణం తెలుసుకుంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్నాడన్న విషయం తెలిసిన రేణు నగర్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ప్రియుడు ఎవరు, అసలు విషయం ఏమిటంటే…ఓ పెద్ద కథే ఉంది.
ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేసిన రేణు నగర్ దగ్గరకు సంగీత పాఠాల కోసం రవిశంకర్ అనే వివాహితుడు తరచూ వస్తూ ఉండేవాడు. కొంతకాలం తరువాత వీరి పరిచయం ప్రేమగా మారింది. రవిశంకర్ తో సన్నిహితంగా ఉంటున్న రేణు నగర్ ని తల్లిదండ్రులు మందలించడం జరిగింది. దీనితో రేణు నగర్, రవి శంకర్ లేచిపోయారు. రేణు తల్లిదండ్రులు కేసు పెట్టడంతో పోలీసులు వెతికి పట్టుకొచ్చి వారికి అప్పగించారు.
ఈనెల 24న ఇంటికి చేరిన ఈ జంట మధ్య ఎడబాటు పెరిగిపోయింది. దీనితో ఇద్దరు పిల్లల తండ్రి రవిశంకర్ విషం తాగి ప్రాణాలు వదిలాడు. రవిశంకర్ ప్రాణాలు వదిలాడన్న విషయం తెలుసుకున్న రేణు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించారు, ఇంకా ఆమె పరిస్థితి క్రిటికల్ గానే ఉందని సమాచారం.