తాజాగా 91వ ఆస్కార్ వేడుకలను… అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ‘ఇండియన్ డాక్యుమెంటరీ’ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే ఇండియన్ డాక్యుమెంటరీ చిత్రానికి ‘బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ’ కాతాలో ఆస్కార్ లభించడం విశేషం.
ఇంతలా ఈ చిత్రానికి అవార్డు దక్కడం ఏంటా అని ఆలోచిస్తే… భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ(పీరియడ్స్) సమస్యల గురించి ఈ సినిమాలో చూపించారు. దాదాపు 25 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతంలో రూపొందించారు. ఇక ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్ న్యాప్కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకోవడంతో పాటు… ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సహాయపడ్డారో అనేదే ఈ చిత్రం కాన్సెప్ట్ కావడం విశేషం. రేకా జెహ్ తాబ్చి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. గతంలో పలు ఇండియన్ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయినప్పటికీ.. అవార్డుల రాక చాలా సార్లు నిరుత్సాహ పడ్డారు మన ఇండియన్ ప్రేక్షకులు. అయితే ఈసారి ఈ డాక్యుమెంటరీ కి ఆస్కార్ దక్కడం నిజంగా హర్షించే విషయం అనడంలో సందేహం లేదు.