నస్లెన్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రూపొందింది. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భాషల్లో డబ్ అయ్యింది.’వేఫేరర్ ఫిలిమ్స్’ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆగస్టు 29న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ మార్నింగ్ షోలు మిస్ అవ్వడంతో.. ఈవినింగ్ షోలతో రిలీజ్ అయ్యింది అని చెప్పాలి.
మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో… ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది. డామినిక్ అరుణ్ డైరెక్షన్ తెలుగు ఆడియన్స్ కి కూడా కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ‘సితార..’ నాగవంశీ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.4 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. 4 డేస్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
ఏపీ+తెలంగాణ | 2.6 cr (షేర్) |
కేరళ | 11.85 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.24 cr |
ఓవర్సీస్ | 24.77 cr |
వరల్డ్ టోటల్ | 44.46 cr (షేర్) |
‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ..4 రోజుల్లో .. రూ.44.46 కోట్ల లాభాలు అందించింది. మొత్తంగా రూ.24.46 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 రోజుల్లో రూ.2.6 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతానికి రూ.0.10 కోట్ల ప్రాఫిట్స్ అందించింది.