కొంతమంది హీరోయిన్ల ప్రేమకథలు ఓపెన్ సీక్రెట్‌లు.. ఇలా ప్రేమలో పడగానే అలా బయటకు వచ్చేస్తాయి. ఇంకొంతమంది ప్రేమకథలు చాలా సీక్రెట్‌లు. వాళ్లు బయటకు చెప్పేంతవరకు ఎవరూ లీకులు ఇవ్వరు. ఇలాంటి వాటిలో ఒకటి కీర్తి సురేశ్ కాగా.. ఇప్పుడు నివేదా పేతురాజ్ కూడా ఈ లిస్ట్‌లోకి చేరింది. నివేదా పేతురాజ్ ఇటీవలే తనకు కాబోయే వరున్ని సోషల్ మీడియాలో పరిచయం చేసింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోబోతోంది.
Nivetha Pethuraj
రజిత్‌తో దిగిన ఫోటోలను వినాయక చవితి రోజున షేర్ చేస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేశామని చెప్పిన నివేదా… అక్టోబరులో ఎంగేజ్‌మెంట్, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి ఉంటాయని తెలిపింది. దుబాయ్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఫార్ములా ఈ రేసింగ్‌లో రజిత్ ఇబ్రాన్‌తో పరిచయం ఏర్పడిందని నివేదా తన ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేసింది. అలా కలసి ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని, ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లకూడదు అనిపించిందని తెలిపింది. తమ లవ్ సంగతి బాగా కావాల్సిన వారికి తెలుసని, ఇండస్ట్రీలో ఎవరికీ చెప్పలేదని చెప్పింది నివేదా.
రజిత్ ఇబ్రాన్ తమిళ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. దుబాయి బేస్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలా అక్కడ జరిగిన ఫార్ములా రేసింగ్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందన్నమాట. ఐదేళ్లు ప్రేమలో ఉండి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక నివేదా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రేసింగ్‌లు చేసుకుంటూ తన సరదాలు, ప్యాషన్ నెరవేర్చుకుంటోంది.
2016లో ‘ఒరు నాళ్ కూతు’ అనే సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైంది. ఆ తర్వాత ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆఖరిగా ఆమె నటించిన సినిమా తెలుగు, తమిళంలో తెరకెక్కిన ‘బూ’. 2023లో ఈ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఆమె ఏ సినిమానూ అంగీకరించలేదు/ చేయలేదు. అయితే గతేడాది ‘పరువు’ అనే వెబ్‌సిరీస్ చేసింది.