5 భాషల్లో విడుదలవుతున్న మడ్ రేస్ మూవీ ‘మడ్డీ’

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ప్రేక్షకులకు 4×4 వినూత్నసినిమా అనుభవాన్ని అందించే ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగభల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ‌ కృష్ణదాస్ నిర్మించారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు మలయాళ భాష‌ల‌లో విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ ఇటీవలే విడుదలయ్యింది. రియ‌లిస్టిక్ విజువ‌ల్స్‌తో ఎంతో గ్రాండియ‌ర్‌గా ఉన్న ఈ మోష‌న్ పోస్ట‌ర్ 2 మిల‌య‌న్స్‌కి పైగా వ్యూస్‌తో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ నెల 26న విడుద‌ల చేయ‌నున్నారు. రియలిస్టిక్ యాక్షన్ రేసింగ్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ‘మడ్డీ’ చిత్రం రూపొందింది.

మోషన్ పోస్టర్ లోని విజువల్స్ ఎంతో గ్రాండ్ గా, రియలిస్టిక్ గా ఉండి చిత్రం పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కోసం రియ‌ల్ మ‌డ్ రేస‌ర్స్ పని చేశారు. ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు ద‌ర్శ‌కుడు డాక్టర్ ప్రగభల్. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిట‌ర్‌. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. పాపులర్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ మడ్ రేసింగ్ యాక్షన్ ఫిల్మ్ ఇండియన్ స్క్రీన్ మీద ఒక సరికొత్త అటెంప్ట్. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus