ఒకే స్టేజ్ మీదకు ఇంద్రజ, కుష్బూ.. ఇక సందడే సందడి

బుల్లితెరపై ఇంద్రజ, కుష్బూలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. వినోదభరితమైన కార్యక్రమాలకు జడ్జ్‌లుగా ఇంద్రజ, కుష్బూలు బాగా రాణిస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలను వారిద్దరూ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే స్టేజ్ మీదకు రాబోతోన్నారు. వినాయక చవితి స్పెషల్‌గా చేస్తున్న ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూలు కలిసి కనిపించారు.

వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో జై జై గణేశా అనే ప్రోగ్రాంను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో శనివారం ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక ఈ ఎపిసోడ్‌లో జబర్దస్త్ జడ్జ్ అయిన కుష్బూ, శ్రీదేవీ డ్రామా కంపెనీని నడిపిస్తున్న ఇంద్రజ కలిసి సందడి చేయబోతోన్నారు. వీరితో పాటు హీరో శివాజీ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.

కుష్బూ, ఇంద్రజ వేసిన డ్యాన్స్‌లకు, వారి ఇంట్రోలకు శివాజీ ఫిదా అయ్యారు. మేడం సర్ మేడం అంతే అని హ్యాట్సాఫ్ చెప్పేశారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఇక రేపు ఈ కార్యక్రమంలో వీక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

Jai Jai Ganesha Latest Promo 03 - Vinayaka Chavithi Special Event - 7th September 2024 @9:00 AM

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus