‘బిగ్ బాస్4’ కు మరో సమస్య వచ్చి పడిందే..!

  • July 24, 2020 / 10:42 AM IST

తెలుగునాట ‘బిగ్ బాస్’ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే 3 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. త్వరలో నాలుగవ సీజన్ కూడా మొదలు కాబోతుంది. నిజానికి జూలై ఎండింగ్ కే ప్రారంభం కావాల్సిన ‘బిగ్ బాస్4’… వైరస్ మహమ్మారి కారణంగా.. ఆలస్యమవుతూ వస్తోంది. ఆగష్ట్ నుండీ ‘బిగ్ బాస్4’ మొదలు కాబోతుందనేది తాజా సమాచారం. ఈసారి 50రోజుల పాటు మాత్రమే ఈ షోని కండక్ట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈసారి ‘బిగ్ బాస్4’ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లకు పారితోషికాల్లో కోతలు కూడా విధించారట.

అయినప్పటికీ ఈ షో నిర్వాహకుల పై అధిక భారం పడనుందని వినికిడి. వివరాల్లోకి వెళితే… ‘బిగ్ బాస్’ షో కోసం కంటెస్టెంట్లు మాత్రమే కాదు.. తెర వెనుక వందల మంది పనిచేస్తుంటారు. వారందరికీ ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించాలి అనే నిబంధన ఏర్పడిందట. వైరస్ మహమ్మారి కారణంగా ఈ కొత్త నిబంధన వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో గతంలో కంటే.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ నిర్వాహకులకు.. 20 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని సమాచారం. ఇక ఈ సీజన్ ను కూడా ‘కింగ్’ నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు.

తరుణ్, ‘మహాతల్లి’ జాహ్నవి, యాంకర్ వర్షిణి.. వంటి వారు ఈ షోలో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ.. వాటిలో నిజం లేదని సమాచారం. మొత్తం కంటెస్టెంట్ ల లిస్ట్ షో మొదలయ్యే రెండు, మూడు రోజుల ముందు మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus