Mohan Babu, Jr NTR:ఎన్టీఆర్ అని పేరు పెట్టి పిలవలేనన్న మోహన్ బాబు.. ఏం చెప్పారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) సినిమా భారీ అంచనాలతో తెరకెక్కి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమా తర్వాత థియేటర్లలో రిలీజ్ కానున్న పెద్ద సినిమా దేవర కావడం గమనార్హం. దసరా పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా దసరా సెలవులను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ టాలెంట్ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ గతంలో ఒక సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని నేను ఎప్పుడూ అననని సీనియర్ ఎన్టీఆర్ ను నేను అన్నయ్యా అని పిలిచేవాడినని మోహన్ బాబు పేర్కొన్నారు.

తారక్ ను అన్నయ్యా అంటే ఆయుఃక్షీణం అని ఎన్టీఆర్ అనే పదాన్ని నేను ఏకవచనంతో సంబోధించనని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ఎప్పుడూ తారకా, ఏరా బాగున్నావా బిడ్డా అని ఆశీర్వదిస్తూ ఉంటానని మోహన్ బాబు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య స్థాయిలో గొప్పవాడు కావాలని హృదయపూర్వకంగా నేను కోరుకునేవాడినని మోహన్ బాబు కామెంట్లు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ తో నాకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే అని మోహన్ బాబు పేర్కొన్నారు. మేజర్ చంద్రకాంత్ సినిమా ఈరోజుకు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్న చిత్రం అని మోహన్ బాబు వెల్లడించారు. మరోవైపు దేవర సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus