మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సురేష్ కృష్ణ (Suresh Krissna) దర్శకత్వంలో ‘మాష్టర్’ (Master) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ‘డాడీ’ (Daddy)అనే ఫ్యామిలీ డ్రామా తెరకెక్కింది అనే సంగతి అందరికీ తెలిసిందే. సిమ్రాన్ (Simran) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అషీమా భాల్లా సెకండ్ హీరోయిన్ గా నటించింది. 2001 అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. జస్ట్ యావరేజ్ మూవీగా నిలిచింది. తండ్రీ కూతుళ్ళ మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఇది.
ఈ సినిమా ఆడకపోయినా.. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బహుశా ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకటి ఇందులో అల్లు అర్జున్ కూడా నటించాడు. అతని పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) చేయాలట. అవును ‘డాడీ’ లో మొదట కీర్తి సురేష్.. చిరుకి కూతురి పాత్ర చేయాల్సి ఉంది. 2000 వ సంవత్సరంలో వచ్చిన ‘పైలెట్స్’ మూవీతో కీర్తి సురేష్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమాలో ఆమె నటన చూసి చిరు.. ‘డాడీ’ లో కూతురి పాత్రకి రిఫర్ చేశారట. దర్శకుడు సురేష్ కృష్ణ కూడా అందుకు ఓకె చెప్పారు. కానీ ఒకటి, రెండు సీన్స్ చిత్రీకరించాక సురేష్ కృష్ణ ఆమె నటనతో సంతృప్తి చెందలేదట. ఇదే విషయాన్ని చిరుకి చెబితే వేరే పాపని తీసుకుందామని చెప్పారట. అలా అనుష్క మల్హోత్రా వచ్చి చేరిందని తెలుస్తుంది.
అయితే కూతురిగా రిజెక్ట్ అయినప్పటికీ.. స్టార్ హీరోయిన్ అయ్యాక కీర్తి సురేష్ ని ‘భోళా శంకర్’ లో (Bhola Shankar) చెల్లెలి పాత్రకి ఏరి కోరి తీసుకున్నారు చిరు. ఈ సినిమా ఆడకపోయినా.. వీరి కాంబినేషన్ కి అంత కథ ఉంది.