Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

25 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకా అని చూస్తే ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన మమ్ముట్టి పాత్రకు సంబంధించిన ఓ వార్త గురించి మరోసారి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలోకి ఆయన రావడం వెనుక ఏం జరిగింది, ఆ పాత్ర ప్రత్యేకత ఏంటి, ఎందుకు అగ్ర హీరోలు చాలా మంది ఆ పాత్రను చేయలేదు, ఆ క్యారెక్టర్‌ను ఆయన ఎలా చేశారు అనేదే ఆ డిస్కషన్‌ సారాంశం. సినిమా పేరు చెప్పలేదు కదా.. ‘కండుకొండైన్‌ కండుకొండైన్‌’. అదేనండీ ‘ప్రియురాలు పిలిచింది’.

Priyuralu Pilichindi

ఈ సినిమా పేరు ఎత్తగానే 90ల ఆఖరి రోజుల యూత్‌కి, 2000 బ్యాచ్‌ యూత్‌కి గుర్తొచ్చేది ‘గంధపు గాలికి..’ పాట. అజిత్‌ – టబు మధ్య తెరకెక్కిన ఆ పాట ఓ అద్భుతమే అని చెప్పాలి. ఆ విషయం తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు మమ్ముట్టి గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌కు జంటగా మమ్ముట్టి నటించారు. యుద్ధంలో ఓ కాలు కోల్పోయిన మేజర్‌ బాల పాత్రలో మమ్ముక్క జీవించేశారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఆ పాత్ర మమ్ముట్ట ముందు చాలామంది స్టార్స్ దగ్గరకు వెళ్లిందట. బాల పాత్ర గొప్పతనం ఆ నటుడి నడకలోనే ఉంటుంది. కాలు కోల్పోయిన వ్యక్తిగా నటించడానికి ఆ రోజుల్లో హీరోలు ఎవరూ అంగీకరించలేదు. ఒక కాలు ఉన్న పాత్రలో నటించడం మాకు ఇష్టం లేదని చెప్పేశారు. అప్పుడు మమ్ముట్టి ఆ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు. అది లోపంగా ఆయన భావించలేదు అని దర్శకుడు రాజీవ్‌ తెలిపారు. మేం అనుకున్నట్లుగానే మమ్ముట్టి నడుస్తున్నప్పుడు కుడి వైపునకు వంగి నడిచారు. పాత్ర అద్భుతంగా వచ్చింది అని చెప్పారు డైరక్టర్‌.

అలా ఆ పాత్ర అనుకోని విధంగా మమ్ముట్టి దగ్గరకు వచ్చింది. ఆయన తనదైన శైలిలో అద్భుతంగా నడిచి / నటించి మెప్పించారు. వేరే నటుడు అయితే ఎలా చేసుండేవారో అనే థాట్ కూడా రాకుండా మమ్ముక్క కేక పుట్టించారు మరి.

యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus