స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనే సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అఖండ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
బోయపాటి శ్రీను రామ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది. రామ్ తో తెరకెక్కించే సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ఒక సినిమాను తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే 2024 ఎన్నికలకు ముందే బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.
2014 సంవత్సరంలో ఎన్నికలకు ముందు లెజెండ్ సినిమా విడుదల కాగా ఆ సినిమాలో బాలయ్య క్లైమాక్స్ సన్నివేశాల్లో పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఎన్నికల వాతావరణం ఏర్పడిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం అందుతోంది. ప్రభుత్వంపై సెటైర్లు, విమర్శలు ఉండేలా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలని బాలయ్య బోయపాటి శ్రీనుకు సూచించారని తెలుస్తోంది.
అయితే బాలయ్య ఈ సినిమాతో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. బాలయ్య పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తే ప్రేక్షకులకు కూడా ఆ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.