Balakrishna Ring: బాలయ్య ఉంగరం వెనుక అసలు కథ ఇదే!

స్టార్ హీరో బాలకృష్ణ జాతకాలను నమ్ముతారనే సంగతి తెలిసిందే. ముహూర్తాలకు బాలయ్య ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. బాలయ్య సన్నిహితులు సైతం చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. బాలయ్య నటించిన అఖండ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ లో ప్రేక్షకులను మెప్పించే సన్నివేశాలు ఎక్కువగా లేకపోయినా సెకండాఫ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ బాలయ్య అభిమానులకు విందు భోజనంలా ఉంది. అఖండ సినిమా బాలీవుడ్ లో డబ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రలోని కొన్ని ఏరియాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. అయితే అఖండ సక్సెస్ కు బాలయ్య ధరించిన ఉంగరానికి సంబంధం ఉందని సమాచారం. బాలకృష్ణ తన బొటనువేలుకు ధరించిన రింగ్ వల్లే ఈ సినిమా సక్సెస్ సాధించిందని నమ్ముతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా సక్సెస్ కోసం బాలయ్య మంత్రించిన ఉంగరాన్ని ధరించారని బోగట్టా. అమెరికాలో అఖండ సినిమాకు 1 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. అఖండ వల్ల బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి. జాతకాలను, శాస్త్రాలను నమ్మే బాలయ్యకు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. తెలంగాణలో కూడా అఖండ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదయ్యాయి. బాలయ్య కెరీర్ లో అఖండ మూవీ మెమరబుల్ మూవీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

సింహా, లెజెండ్ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ బాలయ్య, బోయపాటి శ్రీను కెరీర్ లో అఖండ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో అఖండ 65 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. మరో రెండు రోజుల్లో పుష్ప రిలీజ్ కానుండటంతో అఖండ హవాకు బ్రేకులు పడే ఛాన్స్ ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus