Krishna, Mahesh: నటిస్తావా అని కృష్ణ అడిగితే మహేష్ అలా చేశారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తూ ఫ్యాన్స్ సైతం సంతోషించేలా చేస్తున్నారు. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు మహేష్ బాబు ఖాతాలో చేరాయి. సర్కారు వారి పాట సక్సెస్ సాధించడంతో మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. అయితే తాజాగా కృష్ణ మహేష్ బాబుకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మంజుల తన సొంత యూట్యూబ్ ఛానల్ లో తన తండ్రి కృష్ణతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మీరు ఇప్పటికీ ఇలా మెరిసిపోతున్నారేంటి నాన్న అని మంజుల అడగగా కృష్ణ గాడ్స్ గిఫ్ట్ అంటూ సమాధానం ఇచ్చారు. జనరల్ గా రెస్ట్ తీసుకుంటానని పని లేకుండా తాను బయటకు వెళ్లనని ఆయన తెలిపారు. తాను సినిమా హీరోను కావాలని ఏ ఉద్యోగం చేయలేదని కృష్ణ చెప్పుకొచ్చారు.

గూఢఛారి 116 సినిమాలో తనను హీరోగా తీసుకుంటామని చెప్పి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని కృష్ణ చెప్పుకొచ్చారు. కూతురు యాక్టింగ్ కెరీర్ వర్కౌట్ కాలేదని బాధగా ఉందా అని మంజుల అడగగా తన కూతురిని హీరోయిన్ ను చేస్తే ఆంధ్ర అంతటా గొడవలు చేశారని ఆయన అన్నారు. నాకు పిల్లలంటే ఇష్టమని ఆయన తెలిపారు. మహేష్ ఒకసారి షూటింగ్ చూడటానికి వచ్చాడని తాను యాక్ట్ చేస్తావా? చేయవా? అని మహేష్ ను అడిగితే నేను చేయను నేను చేయను అంటూ మహేష్ పరుగెత్తాడని ఆయన తెలిపారు.

స్టూడియో మొత్తం మహేష్ పరుగులు పెట్టించాడని కృష్ణ పేర్కొన్నారు. పోకిరి, దూకుడు సినిమాలు ల్యాండ్ మార్క్ సినిమాలుగా నిలుస్తాయని తాను సినిమాలను చూసిన వెంటనే చెప్పానని ఆయన తెలిపారు. ఈ ప్రొమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫుల్ వీడియో రిలీజ్ కానుందని తెలుస్తోంది. కృష్ణ తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఇందులో ప్రస్తావించారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus