Prabhas, Shruti Haasan: సలార్ మూవీలో ఆ పాత్ర చనిపోతుందా?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సలార్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కథనంతో మ్యాజిక్ చేసే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ఎమోషనల్ సీన్లు ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ప్రభాస్ తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సమాచారం. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు వేరే లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్, శృతి మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్ గా ఉంటాయని క్లైమాక్స్ లో శృతిహాసన్ పాత్ర చనిపోతుందని సమాచారం అందుతోంది. శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా శ్రద్ధా కపూర్ ఆ సాంగ్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే పాపులారిటీని సంపాదించుకున్న ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ అంచనాలకు మించి చూపించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తండ్రి పాత్రలో సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus