టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమయ్యారు అమల. అయితే గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అమల హీరోయిన్ గా నటించారన్న సంగతి తెలిసిందే. అందులో ‘పుష్పక విమానం’ కూడా ఒకటి. ఏమాత్రం మాటలు లేకుండా ఆద్యంతం నవ్వించే ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. మాటల్లేకుండా సినిమా కేవలం హావభావాలతో సినిమా మొత్తం నవ్వించడం అంటే సాధారణ విషయం కాదు. అందుకే సింగీతం.. కమల్ హాసన్ వంటి నటుడుని ఎంచుకున్నాడు. ఇక హీరోయిన్ గా అమలను తీసుకున్నారు.
ఆమెకు ఈ చిత్రం చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. అప్పటివరకూ ఉన్న అమల ఇమేజ్ ను డబుల్ చేసింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అమల ఫస్ట్ ఛాయిస్. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టిన తరుణంలో.. ఒకరు మాధురీ దీక్షిత్ పేరు సూచించారట. బాలీవుడ్ హీరోయిన్ అయిన మాధురీ దీక్షిత్.. ఆ టైములో ఐరన్ లెగ్ అనే విమర్శలు ఎదుర్కొంటుంది. అయినప్పటికీ సింగీతం ఆమె మేనేజర్ ను సంప్రదించాడట.
అయితే మాటల్లేని సినిమాలో ఆమె నటించదు అని అతను తేల్చి చెప్పెయ్యడంతో… సింగీతం లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. ఆ తరువాత అమలను ఖరారు చెయ్యడం.. సినిమా పూర్తయ్యి విడుదలైన తరువాత సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకోవడం జరిగింది. అయితే లేట్ గా ఈ విషయాన్ని తెలుసుకున్న మాధురీ.. ఇంత మంచి సినిమాలో అవకాశం కోల్పోయినందుకు అతని మేనేజర్ పై మండి పడిందని వినికిడి.