Radhe Shyam: రాధేశ్యామ్ ట్రైన్ సీన్ వెనుక కథ ఇదేనా?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ వీకెండ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా మండే కలెక్షన్లు చూసిన తర్వాత ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ లోనే భారీగా నష్టాలను మిగిల్చిన మూవీగా రాధేశ్యామ్ నిలిచే ఛాన్స్ ఉంది.

Click Here To Watch Now

రాధేశ్యామ్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కథ, కథనంలోని లోపాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి. ఈ సినిమాకు భారీమొత్తంలో ఖర్చు చేసినా ఖర్చుకు తగిన సన్నివేశాలు సినిమాలో లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండటం వల్ల కూడా ఈ సినిమా ఫ్లాప్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే రాధేశ్యామ్ లోని ఒక సన్నివేశం కాపీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాధేశ్యామ్ లో ప్రభాస్ జాతకాలు చూసి ఆ ట్రైన్ కు యాక్సిడెంట్ అవుతుందని ఊహిస్తాడనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రైన్ ను ఆపాలని ప్రభాస్ ప్రయత్నం చేసినా వర్కౌట్ కాదు. అయితే 17 సంవత్సరాల క్రితం విడుదలైన రిలాక్స్ సినిమాలో విజయ్ చందర్ జ్యోతిష్కుడిగా నటించగా ఆ సినిమాలో ఇలాంటి సన్నివేశమే ఉంది. అయితే ఆ సీన్ ఒక జ్యోతిష్కుడి నిజ జీవితంలో జరిగిన ఘటన కొంతమంది చెబుతుండగా మూడు దశాబ్దాల క్రితం తెరకెక్కిన ఒక మలయాళ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉందని మరి కొందరు చెబుతున్నారు.

దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సీన్ ను ఎక్కడినుంచైనా స్పూర్తి పొందారా? లేక సొంతంగా రాసుకున్నారా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఆయన స్పందించే వరకు ఆగాలి. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం రాధేశ్యామ్ లో సీన్ కాపీ అని మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus