Rajamouli: జక్కన్న సక్సెస్ సాధించడానికి కారణమైన ప్రశ్న ఇదే!

  • October 10, 2022 / 06:57 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో ఒకరనే సంగతి తెలిసిందే. సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు జక్కన్న ప్రతి సీన్ ను అద్భుతంగా తెరకెక్కించి ప్రతి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే రాజమౌళి గురించి చాలా విషయాలు ఆయన అభిమానులలో చాలామందికి తెలియవు. ఈరోజు జక్కన్న పుట్టినరోజు కాగా కర్ణాటకలోని రైచూర్ లో రాజమౌళి జన్మించారు.

రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి కాగా ఖాళీగా ఉండవద్దని నాన్నమ్మ చెప్పిన మాటల వల్లే రాజమౌళి మారారు. నాన్నమ్మ నుంచి కథలను ఇతరులకు చెప్పడాన్ని జక్కన్న నేర్చుకున్నారు. స్కూల్ రికార్డులలో జక్కన్న పేరు విజయ అప్పారావు అని ఉండేది. ఆ పేరు జక్కన్న తాతయ్య పేరు కావడం గమనార్హం. ఆ పేరుతో ఎవరైనా పిలిస్తే రాజమౌళి తెగ ఫీలయ్యేవారని సమాచారం అందుతోంది.

ఇంటర్ పూర్తి చేసిన రాజమౌళికి “లైఫ్ లో ఏం చేద్దామనుకుంటున్నారు” అని ఆయన వదిన శ్రీవల్లి అడగగా ఆ ప్రశ్న రాజమౌళి జీవితాన్ని ఒక విధంగా మార్చేసింది. ఆ తర్వాత రాజమౌళి కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో అసిస్టెంట్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దగ్గర రాజమౌళి పని చేయడం గమనార్హం.

రాఘవేంద్రరావు గారి దగ్గర పని చేసే సమయంలో ఒక్కో యాడ్ కోసం జక్కన్న 5000 రూపాయలు తీసుకున్నారు. ఇదే జక్కన్న తొలి సంపాదన కావడం గమనార్హం. ఆ తర్వాత రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ ను తెరకెక్కించారు. స్టూడెంట్ నంబర్1 సినిమాతో సినిమా డైరెక్టర్ గా రాజమౌళి జీవితం మొదలైంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో రాజమౌళి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus